calender_icon.png 22 September, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊరెళ్తున్నారా జర ఇల్లు భద్రం..

22-09-2025 06:25:38 PM

సీఐ సత్యనారాయణ రెడ్డి 

జనగామ (విజయక్రాంతి): పట్టణ, మండల ప్రజలకు విజ్ఞప్తి.. ఇండ్లలో చోరీలను నియంత్రణ చేసేందుకు పోలీసులు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. అలాగే చోరీల కట్టడికై ప్రజలు, ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవాలే తప్ప, పక్కింటి వారికి తెలిసిన వారికి ఇచ్చి మోసపోవద్దు. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. ద్విచక్రవాహనాలకు తప్పనిసరిగా చైన్స్ తో లాక్ వెయ్యడం మంచిది. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్ మెన్, సెక్యూరిటీ గార్డ్, సర్వెంట్ గా నియమించుకోవాలి. సోషల్ మీడియాలో మీ లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే మీ అప్డేట్స్ పెట్టకండి.

మీ ఇంట్లో స్వీయ రక్షణ సీసీ కెమెరాలను అమర్చుకోవాలి. ఆన్ లైన్లో ఎప్పటికప్పుడు మొబైల్ లో మీ ఇంటిని, పరిసరాలను లైవ్, ప్రత్యేక్షంగా చూసుకొవచ్చు. సెక్యూరిటీ, సర్వేలైన్స్ కు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటి వారికి ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కట్టెన్ వేయాలి. ఇంట్లో ఏదో ఒక గదిలో లైట్ వేసి ఉంచాలి. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100 కు చేయాలని కోరారు.