22-09-2025 06:06:57 PM
అమ్మవారి మాల ధారణ ధరించి ప్రత్యేక పూజలు..
చిట్యాల (విజయక్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో పదో వార్డు ముత్యాలమ్మ గూడెం కాలనీలో శ్రీ శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 15వ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఉత్సవ కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టిచ్చేందుకు ప్రత్యేక అలంకారాలతో కూడిన మండపాన్ని ఏర్పాటు చేసి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారు నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అమ్మవారి 11 అవతారాలకు వివిధ రంగుల పట్టు వస్త్రాలతో, రంగురంగుల పుష్పాలతో, ఇష్టమైన నైవేద్యాలతో అమ్మవారిని అలంకరించి, ఆడపడుచుల బతుకమ్మ ఆటపాటలతో, భజనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు.
అమ్మవారి మాల ధారణ చేసిన భక్తులు శరన్నవరాత్రులు అమ్మవారి సన్నిధిలో ఉంటూ భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు తీగల శివ, బెల్లం నవీన్ కుమార్, కంభంపాటి సతీష్, బోయ సురేష్, గండూరి రామకృష్ణ, ఐలాపురం నరేష్, చింతపల్లి ప్రవీణ్ కుమార్, సిలువేరు రిశ్వంత్, గండూరి భాను, బొడ్డుపల్లి ఉపేందర్, బత్తుల రమేష్, గూడ అఖిల్, తీగల శ్రీకాంత్, మావిళ్ళ యాదమ్మ, పిల్లి రవి, గూడ సాయి కిరణ్, తీర్పాల గణేష్, చింతపల్లి మహేష్, కొత్తకొండ అభిషేక్, తదితరులు పాల్గొన్నారు.