calender_icon.png 22 September, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూములు ఆక్రమిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి

22-09-2025 06:02:27 PM

ప్రజావాణిలో బాధితుడు కలెక్టర్ కు వినతి

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): గత కొంతకాలంగా గాలి మురళీకృష్ణ, రేఖల శ్రీనివాస్ వారి అనుచరులు మా స్వాధీనంలో ఉన్న భూమిని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారని నల్లగొండ పట్టణంలోని కేశరాజు పల్లి ప్రాంతానికి చెందిన కోడి రెక్క యాదగిరి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని  ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.  భూమిని ఏ విధంగానైనా స్వాధీనం చేసుకోవడానికి దౌర్జన్యానికి పాల్పడుతున్నారని నేతి పత్రంలో పేర్కొన్నారు.

వృద్ధుడైన రావిరాల రామ లచ్చయ్య, వికలాంగుడైన రావిరాల రవి కిరణ్ ను పై వ్యక్తులు తీవ్ర భయాందోళనకు  గురి చేస్తున్నారని పేర్కొన్నారు. వీరు   పలుమార్లు భూ అక్రమానికి ప్రయత్నించగా వీరిపై తిప్పర్తి పోలీస్ స్టేషన్లో ఇప్పటికే వీరిపై 3 కేసులు నమోదు అయ్యాయని వీరి దౌర్జన్యం, అరాచకాల వలన మా కుటుంబ సభ్యులకు ప్రాణభయం కూడా ఉన్నదని తెలిపారు. గతంలో రెవిన్యూ అధికారులు చేసిన తప్పిదం, వీరిద్దరి దౌర్జన్యం వలన మేము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, భూమి లేకున్నా, భూమి ఉందంటూ మా భూమిని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తులపై  నమోదు చేసి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.