calender_icon.png 22 September, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దంచి కొట్టిన వాన... పత్తి రైతుల ఆందోళన...

22-09-2025 05:55:07 PM

రేగొండ,(విజయక్రాంతి): సోమవారం సాయంత్రం భూపాలపల్లి, రేగొండ వ్యాప్తంగా వాన దంచి కొట్టింది.గత రెండు రోజుల నుండి ఉక్కపోతతో కూడిన ఎండలు జిల్లా వ్యాప్తంగా ఉండగా సోమవారం సాయంత్రం మాత్రం ఆకస్మికంగా వచ్చిన వాన కుండపోతగా కురిసింది. దీంతో జిల్లావ్యాప్తంగా పత్తి రైతులు ఆందోళన చెందారు. ఈ దసరా పండుగకు పత్తి పూత, కాతతో ఏపుగా పెరిగి పత్తి పండడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ వాన దంచి కొట్టడంతో పత్తి లోని పూత కాయ రాలుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాన ఒక్కసారిగా కుండ పోతగా  కురవడంతో రహదారులు, పంట పొలాల పై నుండి వరదలు వెళ్లాయి.