20-11-2025 05:24:41 PM
అధ్యక్షులు బీమరి గణేష్ ఏకగ్రీవం..
జగదేవపూర్: జగదేవపూర్ మండల కేంద్రంలో మండల ఫోటోగ్రాఫర్ వీడియో గ్రాఫర్స్ నూతన కమిటీ మండల అధ్యక్షులు బీమరి గణేష్ ముదిరాజ్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులు సయ్యద్ మునీర్ ఏకగ్రీవంగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సంఘం బలోపేతం కోసం కృషి చేస్తానని ఫోటోగ్రాఫర్లు వీడియో గ్రాఫర్లు పడుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, ప్రచార కార్యదర్శి కొరమైన యాదగిరి, కోశాధికారి రమేష్,సంఘ సభ్యులు రాజు, గుర్రం శ్రీకాంత్, ఉదయ్ కిరణ్, పిట్టల కనకయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.