20-11-2025 05:28:04 PM
తూర్పుపల్లి గ్రామంలో మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్..
దేవరకొండ (విజయక్రాంతి): ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో మార్నింగ్ వాక్ విత్ పీపుల్ కార్యక్రమాన్నికొనసాగిస్తున్నట్టు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. గురువారం దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామాన్ని అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిశీలిస్తూ అక్కడి ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని. ప్రజల శ్రేయస్సు కోసం మౌలిక సదుపాయాలను విస్తరించడంలో ఏ మాత్రం రాజీపడబోమని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించి మరింత వేగవంతం చేస్తాం అని ఆయన అన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు అధికారులను ఆదేశిస్తూ, అధికారులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలిని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.