20-11-2025 07:11:37 PM
మంథనిలో విలేకరుల సమావేశంలో సిఐ రాజు
మంథని (విజయక్రాంతి); సివిల్ సప్లై కార్పొరేషన్ కు బియ్యం ఇవ్వకుండా రూ.12 కోట్ల మోసం చేసిన వరప్రసాద్ రావు అరెస్ట్ చేసినట్లు మంథని సీఐ రాజు తెలిపారు. గురువారం మంథని పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని గద్దలపల్లి గ్రామ సమీపంలో గల ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీస్ యొక్క పార్ట్నర్స్ అయిన కరీంనగర్ లోని శ్రీపురం కాలనీకి చెందిన బైర్నేని వరప్రసాద్ రావు మంథని మండలంలోని పుట్టపాక చెందిన తాటిపల్లి శ్రీనివాస్, వద్ద సివిల్ సప్లై కార్పొరేషన్ వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్ సీజన్ కు గాను కొనుగోలు చేసిన వడ్లను శ్రీ లక్ష్మీ ప్రసన్న రైస్ మిల్లుకు 38,489 క్వింటాళ్లు ఇస్తే, అందుకుగాను శ్రీలక్ష్మి ప్రసన్న ఇండస్ట్రీస్ వారు సివిల్ సప్లై కార్పొరేషన్ వారికి 25680.43 క్వింటాళ్ల బియ్యంను అప్పగించాలని, కానీ నిందితులు అయిన ఏ-1 వరప్రసాద్ రావు ఏ-2 తాటిపల్లి శ్రీనివాసులు చేసుకున్న అగ్రిమెంట్ దుర్వినియోగం చేసి సివిల్ సప్లై కార్పొరేషన్ వారికి బియ్యం ఇవ్వకుండా రూ. 12 కోట్ల 37 లక్షల 8 వేల 59 రూపాయలు మోసం చేసినందుకు సివిల్ సప్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్, ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 139/2024 U/S 406, 409, 420 ఐపిసి సెక్షన్ల కింద మంథని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని, ఈ కేసులో ఏ-2 అయిన తాటిపెల్లి శ్రీనివాస్ ను గతంలో అరెస్టు చేయగా, బుధవారం బైర్నేని ప్రసాద్ రావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చమని సీఐ తెలిపారు.