20-11-2025 06:39:52 PM
నిర్మల్ (విజయక్రాంతి): విజ్ఞానం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆ విజ్ఞానాన్ని అందించే గ్రంథాలయాలను సద్వినియోగించుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జున్ అలీ అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సమావేశంలో హాజరయ్యారు. సరస్వతి చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం నిర్మల్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సయ్యద్ అర్జున్అలీ, ముఖ్య అతిథులుగా శ్రీ సామ భీమ్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రంథాలయాల ప్రాధాన్యతను వివరించారు. పాటకుల కోసం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు.
గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిక్షపతి నాయక్ కవితను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాందేడ్ చిన్ను యూత్ జిల్లా అధ్యక్షులు సమరసింహారెడ్డి నాయకులు గణేష్ ఎం బిక్షపతి నాయక్ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రంథాలయ అధికారి మోహన్ సింగ్, శ్రీమతి ఆశాకిరణ్ శ్రీమతి కే సుజాత శ్రీమతి ఈ గ్రంథాలయ సిబ్బంది శ్రీ పి విజయ శ్రీ, కటకం సంజీవరెడ్డి, రాథోడ్ మోహన్ సింగ్, రాజు, పృథ్విరాజ్ లెనిన్ బాబురావు గ్రంథాలయ ప్రగతి నివేదిక శ్రీ రాథోడ్ మోహన్ సింగ్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.