calender_icon.png 20 November, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆడపిల్లలకు చదువుతోనే భవిష్యత్తు

20-11-2025 06:48:05 PM

కొమరవెల్లి: ఆడపిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు బంగారు మయంగా మారుతుందని జిల్లా మహిళా సాధికారత జెండర్ స్పెషలిస్ట్ వి లావణ్య అన్నారు. బేటి బచావో, బేటి పడావో ప్రోగ్రాంలో భాగంగా కొమరవెల్లి కేజీబీవీ పాఠశాలలో బాలల హక్కులు, బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజంలో ఎదుర్కొంటున్న సమస్యలలో సగానికి పైగా ఆడవారు చదువుకోకపోవడంతోనే ఉత్పన్నమవుతున్నాయన్నారు. చట్టం తమకు హక్కుల గురించి తెలుసుకోవాలన్నారు. చుట్టాలపై అవగాహనతోనే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారులు పి నీరజ, కే శివరంజని ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.