calender_icon.png 20 November, 2025 | 8:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో మోగనున్న పంచాయతీ ఎన్నికల నగారా

20-11-2025 06:51:19 PM

వారం రోజుల్లో షెడ్యూల్ విడుదల..

వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణలో ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించి గురువారం ఎన్నికల కమిషన్ కలెక్టర్లతో సమావేశాన్ని నిర్వహించింది. సమావేశంలో వారం రోజులలో నోటిఫికేషన్ విడుదల చేసి మూడు దశలుగా ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఈ నెలలో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి మూడు దశల ఎన్నికలను వచ్చేనెల 15 నుండి 20 వరకు పూర్తిచేసేలా ఎన్నికల కమిషన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.