calender_icon.png 25 September, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెరువులు, కుంటలు కబ్జాలకు గురైతే తగిన చర్యలు తీసుకోవాలి

25-09-2025 12:02:36 AM

అధికారులకు కలెక్టర్ సూచన

యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 24 ( విజయక్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లాలో హెచ్‌ఎం డి ఏ పరిధిలో ఉన్న చెరువులు కబ్జా లపై బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ హనుమంత రావు. హెచ్ ఎం డి ఏ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయని, అన్ని చెరువులకి బఫర్ జోన్లు ఉన్నాయా, చెరువులు ఏమైనా కబ్జా కి గుర్యయ్యాయ అని సంబంధిత అధికారులు అడిగి తెలుసుకున్నారు.

అన్ని చెరువులు ఒకసారి సర్వే చేసి బఫర్ జోన్ లో ప్లేస్ కబ్జా చేసి ఏమైనా కట్టడాలు  చేశారా వాటిని గుర్తించాలన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి జిల్లాలో కొన్ని చెరువులు నిండి బఫర్ జోన్ లు కట్టడాలు కట్టడంతో ఇండ్లల్లోకి నీళ్లు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడ్డారని అన్నారు. అలాంటి వాటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.

హెచ్‌ఎండిఏ  పరిధిలో  చిన్న చిన్న కుంటలు కబ్జా చేసి  లేఅవుట్ల చేస్తున్నారని అలాంటి వాటిని  మళ్లీ పరిశీలించి  చర్యలు తీసుకోవాలి సంబంధిత అధికారులను కోరారు. ఈ సీజన్ లో అన్ని చెరువులు , కుంటలు  నిండుగా ఉన్నాయని కాబట్టి ఒకసారి ఎఫ్టీఎల్ పరిధి లో సర్వే చేపట్టి కబ్జా గురైన వాటిని గుర్తించి చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.