calender_icon.png 25 September, 2025 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే విజయం

25-09-2025 12:02:52 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

బెజ్జూర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం బెజ్జూర్ మండల బీఆర్‌ఎస్ ముఖ్యనాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల నేతలు రైతుల కోసం అందాల్సిన యూరియాను బ్లాక్లో అమ్ముకుని లాభాలు పొందుతున్నా రని ఆరోపించారు.

రూ.275 కు లభించే యూరియాను రూ.1000 కి విక్రయి స్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన లో ఎమ్మెల్యేల గన్మెన్లు తుపాకులు చూపిం చి లారీల కొద్ది యూరియా కనిపించకుండా చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసిఆర్ పాలనలో రైతులు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ ఎదుర్కోలేదని గుర్తుచే శారు. సిర్పూర్ నియోజకవర్గంలోని దిందా, చిత్తం వంటి గ్రామాల్లో రైతులు పంటలు వేసుకోలేకపోయారని, కష్టాల్లో ఉన్న పోడు రైతులు మహారాష్ట్రకు వెళ్ళి కూలిపనులు  చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

హరీశ్‌బాబు అటవీ అధికారు లను టార్గెట్ చేయడం వల్లే వారు  పోడు రైతులను వ్యవసాయం చేయనీయడం లేద ని ఆరోపించారు. ఎన్నికల కోసం ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా  బిఆర్‌ఎస్‌కు మద్దతు తెలిపేం దుకు ప్రజల సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో  నాయకులు అర్షద్ హుస్సే న్, మండల కన్వీనర్ సారయ్య, ఖాజా, తిరుపతి, బాబు రావు, మోహన్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.