calender_icon.png 25 September, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎనర్జీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు

25-09-2025 01:22:14 AM

  1. 2070 నాటికి జీరో ఉద్గారాల దిశగా అడుగులు 
  2. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ 
  3. ఎకనామిక్స్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ఇంధన ఎనర్జీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలతో అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బొగ్గు, గనులు, పునరుత్పాదక శక్తి, క్రిటికల్ మినరల్స్ రంగాల్లో కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగా భారత్ అంతర్జాతీయ ఇంధన రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

ఢిల్లీలో బుధవారం జరిగిన ఎకనామిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్‌షిప్ సదస్సుకు కిషన్ రెడ్డి హాజరై మాట్లాడారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం రూపుదిద్దుకోనున్న నేపథ్యంలో మన ఎనర్జీ అవసరాలు భారీగా పెరగనున్నాయన్నారు. 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల దిశగా మన దేశాన్ని నడిపించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, మౌలిక వసతుల కల్పన వేగతవంతం చేయడం, ఆత్మనిర్భరత సాధించడం, అంతర్జాతీయంగా ఎదిగేందుకు వీలుగా పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు.

అంతర్జాతీయంగా ప్రతికూల రాజకీయ, భౌగోళిక పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఇంధన భద్రతా రంగంలో అవకాశాలను మనకు అనుకూలంగా మలుచుకుంటున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. స్థాపిత పునరుత్పాదక శక్తి సామర్థ్యం విషయంలో భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో, వాయు పవన విద్యుత్‌లో నాలుగో స్థానంలో, సౌర విద్యుత్ ఉత్పత్తిలో మూడో స్థానంలో ఉందన్నారు. 2014 నుంచి పునరుత్పాదక శక్తి ఉత్పత్తి మూడు రెట్లు పెరిగిందని, దేశంలోని విద్యుత్ అవసరాల్లో సగం మేర శిలాజేతర ఇంధనాల నుంచే ఉత్పత్తి అవుతోందని కిషన్‌రెడ్డి వివరించారు. 

1900 మెగావాట్లా సోలర్, పవన్ ఉత్పత్తి కేంద్రాలు.. 

ఇప్పటికే 1,900 మెగావాట్ల సోలార్, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను స్థాపించామని, 2030 నాటికి 15 గిగావాట్ల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. కోల్ గ్యాసిఫికేషన్ మిషన్ ద్వారా 2030 నాటికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని, భవిష్యత్తులో క్రిటికల్ మినరల్స్ అవసరం కూడా పెరగనుందన్నారు. ప్రధానంగా లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరాలు 2040 నాటికి భారీగా పెరగనున్నాయని,  ఈ నేపథ్యంలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ద్వారా ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి, క్రిటికల్ మినరల్స్ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.