25-09-2025 12:50:22 AM
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: లడఖ్ రణరంగంగా మారింది. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇచ్చి, ఆరో షెడ్యూల్‌లో చేర్చాలనే డిమాండ్‌తో పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ చేస్తున్న నిరాహార దీక్షకు తోడు బుధవారం నిరసనకారుల అల్లర్లతో లడఖ్ అట్టుడికింది. రాష్ట్ర హోదా, రాజ్యాంగభద్రతలు కల్పించాలన్న లేహ్ ప్రజల నిరసన తారాస్థాయికి చేరింది. బీజేపీ కార్యాలయానికి నిరసనకారులు నిప్పు పెట్టడంతో కార్యాలయం కాలి పోయింది.
నలుగురు అమాయకుల మృతికి కారణమైంది. ఇది జెన్ జడ్ ఉద్యమం అని వాంగ్‌చుక్ అభిప్రాయపడ్డారు. నిరాహార దీక్ష చేస్తున్న లడఖ్‌కు చెందిన పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్‌చుక్‌కు సంఘీభావం తెలి పేందుకు బుధవారం ‘లేహ్ అపెక్స్ బాడీ’ (ఎల్‌ఏబీ) నిరసనలకు పిలుపుచ్చింది. అయి తే ఈ నిరసనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. నిరసనకారులు పోలీసులతో పాటు పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. పలు చోట్ల నిరసనకారులు పోలీసు వాహనాలను తగులబెట్టారు.
దీంతో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడం తో పాటు బాష్పవాయువు కూడా ప్ర యోగించారు. మరింత రెచ్చిపోయిన నిరసనకా రులు లేహ్‌లో ఉన్న బీజేపీ కార్యాలయా నికి నిప్పు పెట్టారు. పోలీసులు జరిపిన కాల్పు ల్లో నలుగురు మరణించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి కాలం లో లడఖ్‌లో ఇంత పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకోలేదు. బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ విధించి బహిరంగ సభలు, ఊరేగింపులపై లడఖ్ యంత్రాంగం నిషేధం విధించింది.
అక్టోబర్ ఆరవ తేదీన లడఖ్ రాష్ట్ర హోదా విషయం గురించి చర్చించేందుకు కేంద్రప్రభుత్వం లడఖ్ ప్రతినిధులను ఆహ్వానించిం ది. 2019లో లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించారు. గత మూడేళ్లుగా తమ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పించాలని అక్కడి వారు డిమాండ్ చేస్తున్నారు. లడఖ్ వాసుల డిమాండ్లను అధ్యయనం చేసేందుకు కేంద్రప్రభుత్వం ఓ హైలెవల్ కమిటీని నియమించింది.
మార్చిలో లడఖ్‌కు చెందిన కొంత మంది ప్రతినిధులు హోంమంత్రి అమిత్‌షాను కలిసి చర్చలు జరిపారు. అయితే లడఖ్‌లో జరుగుతున్న అల్లర్లతో కాంగ్రెస్‌కు సంబంధం ఉందని బీజేపీ నేత అమిత్‌మాలవీయ ఆరోపించారు. లేహ్ బీజేపీ కార్యాలయాన్ని నిరసనకారులు టార్గెట్ చేయడం వెనుక కాంగ్రెస్ కౌన్సిలర్ స్టాన్‌జిన్ సెపాగ్ ఉన్నారన్నారు. సోనమ్ వాంగ్ చుక్ ఈ ఆరోపణలు కొట్టిపారేశారు.
నిరాహార దీక్ష విరమణ
లడఖ్‌కు రాష్ట్రహోదాతో పాటు ఆరో షెడ్యూల్‌లో లడఖ్ రాష్ట్రాన్ని చేర్చాలనే డిమాండ్‌తో నిరాహార దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్‌వాంగ్ చుక్ నిరాహార దీక్షను విరమించారు. వాంగ్‌చుక్ గత 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. రాష్ట్ర హోదా డిమాండ్ హింసాత్మకంగా మారడంతో నిరాహార దీక్షను విరమించారు. హింసను వీడాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు.