17-12-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 16 (విజయ క్రాంతి): మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలోని మహిళా సాధికారికత విభాగంలో పనిచేస్తున్న మిట్టపల్లి అర్చన శ్రీలంకలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా జరిగిన త్రోబాల్ పోటీలలో బంగారు పథకం సాధించింది.ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అర్చనకు ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. కార్యాలయంలో జిల్లా సంక్షేమ అధికారి ఈ లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ ఆమె ప్రతిభను కొనియాడారు.
ఎంతో వ్యయ ప్రయాసలకు ఓర్చి పట్టుదలతో దేశం తరఫున ఆ డి విజయం సాధించిందని గుర్తు చేశారు. చాలామంది సహ ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన సహా య సహకారంతో ఆమె ఈ విజయం సాధించిందని తెలిపారు. ఒకవైపు ఉద్యోగం నిర్వహించుకుంటూ బాధ్యతలను నెరవేర్చుకుంటూ మరోవైపు కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటూ ఆ టలలో ప్రతిభ చూపించి పథకం తీసుకొని రావడం జిల్లాకు గర్వకారణమని జిల్లా సంక్షేమ అధికారి పీ లక్ష్మీరాజ్యం తెలిపారు.
అలాగే మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారని ది వ్యాం గులు కూడా ప్రోత్సాహం ఇస్తే అన్ని రంగాలలో ముందుకు దూసుకెళ్తారని అర్చన పథకం సాధించడమే దీనికి ఉదాహరణ అని మహిళా సాధికరికత కేంద్రం కోఆర్డినేటర్ రోజా తెలిపారు. దేశం తరఫున ఆడడం గొప్ప విషయమని అర్చన ఎంతో పట్టుదలతో క్రమశిక్షణతో ఈ ఘనతను సాధించిందని ఎసిడిపివో సుచరిత పేర్కొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో చైల్ లైన్ కోఆర్డినేటర్ స్రవంతి.సఖీ సిబ్బంది ఐ సి పి ఎస్ సిబ్బంది జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ సిబ్బంది శోభన , ఫీల్ రెస్పాన్స్ ఆఫీసర్ సంతోష్ కుమార్ శ్రీపాద తదితరులు పాల్గొన్నారు.