calender_icon.png 18 December, 2025 | 11:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజన చిన్నారులకు పునాది నుంచే విద్యను బలోపేతం చేయండి

17-12-2025 12:00:00 AM

ఉపాధ్యాయులను ఆదేశించిన ఐటీడీఏ పీవో రాహుల్ 

భద్రాచలం, డిసెంబర్ 16,(విజయక్రాంతి):గిరిజన చిన్నారుల విద్యను పునాది నుండే బలోపేతం చేయడానికి ఎన్నో సంస్కరణలు చేపట్టడం జరిగిందని ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోని గిరిజన పిల్లల విద్యాభ్యాసం మెరుగుపడేలా పిల్లలకు అర్థమయ్యేలా చక్కటి విద్యా బోధన చేసి చిన్నారులు రాసే పదాలు తప్పులు లేకుండా క్రమ పద్ధతిలో  రాసేలా చర్యలు తీసుకోవాలని, ఉద్దీపకం టు వర్క్ బుక్ లోని పదాలు చిన్నారులు సొంతంగా రాసే విధంగా ఉపాధ్యాయులు కృషి చేసినందుకు వారిని అభినందించడం జరిగిందని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

మంగళవారం  చర్ల మండలంలోని మారుమూల అటవీ ప్రాంతంలోని గ్రామాలైన వద్దిపేట, ఉంజుపల్లి గిరిజన సంక్షేమ శాఖ  జిపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రత్యేకంగా ఉపాధ్యాయుని పాత్ర పోషించి పిల్లల చేత బోర్డుపై అక్షరమాల మరియు అధికారుల యొక్క పేర్లు ఎలా రాయాలో పిల్లల చేత రాయించారు. ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు, చతుర్వేద పదాలు, గణితంలోని కూడికలు తీసివేతలు, ఇంగ్లీషు సంబంధించిన పదాలు పిల్లలను అడిగిన వెంటనే బోర్డుపై రాయడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన చిన్నారుల విద్యాభ్యాసం బలోపేతం చేయడానికి ఉద్దీపకం వర్క్ బుక్ ప్రవేశపెట్టడం జరిగిందని, చాలావరకు గిరిజన చిన్నారులు వర్క్ బుక్ లోని అంశాలు అర్థం చేసుకొని చదవడం, రాయడం చేస్తున్నారని, ఇంకా ఎవరైనా పిల్లలు వర్క్ బుక్కులోని అంశాలు అర్థం చేసుకోవడంలో వెనుకబడి ఉంటే సంబంధిత ఉపాధ్యాయులు వారిపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా రాయించాలని ఉపాధ్యాయులకు సూచించారు.

సంబంధిత ఎస్సిఆర్పీలు తప్పనిసరిగా వారి పరిధిలోని పాఠశాలలను ప్రతిరోజు పర్యవేక్షించాలని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ ఏ పాఠశాలలో అయితే సక్రమంగా జరగడం లేదో గమనించి ఆ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిరోజు గిరిజన చిన్నారులకు ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు తప్పనిసరిగా ఉపాధ్యాయులు బోధించే విధంగా చూడాలని అన్నారు.అనంతరం చర్ల నుండి పూసుగుప్ప రోడ్డు మార్గంలోని రొట్టెటి వాగు బ్రిడ్జి నిర్మాణం 4 కోట్ల 30 లక్షల వ్యయంతో చేపడుతున్న పనులను పరిశీలించి నిర్మాణం పనులు నాణ్యతగా ఉండేలా చూడాలని,

సకాలంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయ్యేలా చూసి గిరిజనుల రాకపోకలకు తొందరగా వెసులుబాటు కల్పించేలా కాంట్రాక్టర్లు త్వరితగతిన పనులు చేయించి సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ ఈ ట్రైబల్ వెల్ఫేర్ టి ఏ శ్రీనివాస్, ఎస్ సి ఆర్ పి జయ ప్రకాష్,  ఉపాధ్యాయులు రాజ్ కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.