17-12-2025 12:00:00 AM
కొండ మామిడిచెట్టు వేరు నుంచి జాలువారుతున్న నీరు
వాగులు ఎండిన ...చెట్టు ప్రాంతంలోనే నీటి మడుగులు
సృష్టి విచిత్రం అంటున్న గిరిజనులు
అశ్వారావుపేట, డిసెంబర్ 16, (విజయక్రాంతి) : అది ప్రకృతి సృష్టించిన అద్భుత మైన జల.జలాశయాలు ఎండిపోయే మం డు వేసవిలో కూడ ఓ బండరాయిపైన ఉన్న కొండమామిడి వేళ్ళు నుండి నిత్యం జాలు వారే జలం. ఆ జలంతో ఆ వరిసరాల్లో ఏర్పడిన నీటి మడుగులు. నిజంగా అద్భుతమే కదా.. చెట్టు వేరు నుండి జాలువారే జలంతో ఏర్పడిన నీటి నిల్వలలను ఆ ప్రాంతంలో జీవించే కొండరెడ్లు ‘జలగుండం అనిపిలుస్తువుంటారు. ఇది నిజంగా సృష్టి మహిమ అని దేవుడు ప్రాంతంగాఅక్కడ గిరిజనులు బావిస్తుంటారు. దీనిపై విజయ క్రాంతి ప్రత్యేక కథనం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
ఆశ్వారావుపేట మండలం పాతరెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో కనిపించే అద్భు తమైన దృశ్వం ’జలగుండం‘. పెద్ద రాతి బం డపై కొండమామిడి చెట్టు(అడవి మామిడి) మొలవడమే అద్భుతమంటే.. ఆ చెట్టు మొదట్లోని వేరునుండి నిత్యం నాలుగైదు చేతి వే ళ్ళమందం నీరు జాలువారుతూనే ఉంటది .ఏదో వర్షాకాలంలో ఇలా జరుగుతుండనుకుంటూ పొరపాటే నిండు వేసవిలో వరిసరాల్లోని వాగ ఎండిపోయిన సమయంలో కూడ ఈ వే ర్లు నుండి అదే రీతిలో నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఈ నీరు పరిసరాల్లోని గుంతల్లో చేరినిల్వ ఉంటాయి.
ఈ జలంతో ఏర్పడిన గుంతలు కావడంతో వీటిని ఆ ప్రాంత గిరిజ నులు జలగుండంగా పిలుస్తుంటారు. వనవి వచ్చిందంటే ఈ జలగుండాన్ని చూసేందుకు పరిసరాల్లోని ప్రజలు తరలివెళతారు. ఒకవైపు జల గుండంమరో వైపు చుట్టు దట్టమైన అటవీ ప్రాంతం , జలగుండంఎదురుగ ఉన్న ఎత్తున కొండ దానిపై నాయపోడు కుల దైవమైన కొర్రాజులు దేవుడు కొలువై ఉంటారు. ఆ దేవుడి మహిమతోనే ఈ గుండం ఏర్పడిందని గిరిజనులు బావిస్తుంటారు.
చల్లగ మధురంగా ఈ జలం ఉంటుది. కొర్రాజులు దేవుడికి గ్రామాంలో జాతరకోసం కొండపైనుండి దింపినప్పుడు ఈ ఆ జలగుండం లోనే స్నానమాచరించచేసి గ్రామాలోకితీసుకెళతారు. ఈ అటవీ ప్రాంతంలో వేసవి కాలంలో జంతువులకు ఈ జల గుండాలే ఆధారం. ఈ దృశ్యాలను చూసేందుకు రెండు కళ్ళుసరిపోవు. ఇలాంటి ప్రదేశాలను ప్రభత్వం గుర్తించి టూరిజం ప్రదేశాలుగా అభివృద్ధి చేస్తే మంచి ఆదరణ లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అడవులలో అలాంటి విచిత్రమైన దృశ్యాలు ఎన్నో కనిపిస్తుంటాయి.