calender_icon.png 21 May, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమార్కుల తెగింపునకు ప్రజాప్రతినిధులు అధికారులే కారణం?

21-05-2025 12:00:00 AM

  1. అసైన్మెంట్ ప్రభుత్వ భూములు అక్రమ కట్టడాలు, వెంచర్లు, రిసార్ట్‌లు

కన్నెత్తి చూడనే అధికారులు.. 

భద్రాద్రి కొత్తగూడెం, మే 20 (విజయ క్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతంగా పేరొందిన పాల్వంచ పట్ట ణంలో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు అదు పు లేకుండా పోతుంది. అధికారుల కన్ను సన్నాల్లోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్మెంట్,  ప్రభుత్వ భూముల్లోబహుళ అంత స్తుల నిర్మాణం, రిసార్టులు నిర్మిస్తున్న అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు.

భవనాలకు అనుమతులు లేకుండా, ఆసుపత్రుల నిర్వహణకు అవసరమైన ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ సౌకర్యాలు లేకుండా నిర్మించిన ఆ క్రమ కట్టడాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హంగు ఆర్భాటాలతో ప్రారంభోత్సవాలు చే యడం జగమెరిగిన సత్యం. అక్రమార్కులకు అధికారులు ప్రజాప్రతినిధుల అండదండలు మెండుగా ఉన్నాయని పాల్వంచ పట్టణంలోని అధికారులు ఆచరణలో రుజువు చేస్తు న్నారని ప్రజలు మండిపడుతున్నారు.

పా ల్వంచ పట్టణ  పరిధిలో 444, 817, 727, 999 ప్రభుత్వ సర్వే నెంబర్లలో నిర్మితమైన బహుళ అంతస్తుల నిర్మాణాలు, రిసార్టులో, అక్రమ వెంచర్లే ప్రత్యక్ష సాక్షం. గతంలో పాల్వంచ తహసిల్దార్ గా మస్తాన్ రావు పనిచేసిన రోజుల్లో దమ్మపేట సెంటర్ నుంచి శ్రీ నివాస కాలనీ వరకు దారి పొడవునా 817 సర్వేనెంబర్ లో ఎలాంటి కట్టడాలు నిర్మించరాదని, ఇది ప్రభుత్వ భూమిని, ఎవరైనా నిర్మాణం చేపడితే శిక్ష హారాలు అంటూ సాక్షాత్ రెవెన్యూ శాఖ బోర్డులను ఏర్పాటు చేసింది.

ఆ తరువాత మారిన ప్రభుత్వాలు, అధికారులు ప్రభుత్వ భూమి పర్యవేక్షణలో పూర్తిగా వైఫల్యం చెందారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం బోర్డులు పాతిన ప్రాం తంలోనే బహుళ అంతస్తుల నిర్మాణాలు, ఆసుపత్రులు, పెట్రోలు బంకులు, రిసార్టులు నిర్మించారంటే అక్రమార్కులకు అధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలు ఏ రీతిలో ఉన్నాయో తేటతెల్లమవుతుంది.

సర్వేనెంబర్ 817లో విస్తృతంగా అక్రమ కట్టడాలు

సర్వేనెంబర్ 817 ప్రభుత్వ భూముల్లో ఇదే తరహా అనేక అక్రమ కట్టడాలు సాగుతున్నాయి. అనుమతులు ఇవ్వకుండానే అక్ర మ కట్టడాలు జోరుగా సాగుతుండటం అధికారులు అక్రమ దారులకు వంతపాడుతు న్నారని వస్తున్న ఆరోపణలను రుజువు చేస్తున్నాయి.

అంతేకాకుండా పంచాయతీ పరిధి లోని ప్రభుత్వ భూములను ఆక్రమించి, త ప్పుడు సర్వే నంబర్లతో డాక్యుమెంట్లను చూపి పట్టణ పరిధిలో ఉన్నట్లు సృష్టించి హెచ్ కన్వర్షన్ హాల్ను నిర్మిస్తున్న, ప్రభుత్వ భూమిని ఆక్రమించి కన్వర్షన్ హాలుకు రోడ్డు నిర్మాణం చేసిన అధికారులు అటువైపు చూ డటానికి కూడా ప్రయత్నించడం లేదు. అంతేకాదు రెవెన్యూ అధికారి ఆ భూమి మండల పరిధిలో ప్రభుత్వ భూమి అంటూ ఎపిటివిటీ దాఖలు చేసినప్పటికీ అధికారులు చర్యలు చర్యలు తీసుకోక పోవడం ఆ అక్రమార్కుడికి అధికార మంత్రి అండదండలే కా రణమని పట్టణం కోడై కూస్తోంది.

అందుకు అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టుతున్నాయని, ప్రజా ప్రతినిధుల వత్తులు అధికంగా ఉన్నట్లు ఆరోపణలు లేకపోలేదు. తాజాగా అనుమతులు లేని భవ నంలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేటు ఆసుపత్రిని రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే ప్రారం భోత్సవం చేయటం పట్టణ ప్రజలను విస్మయానికి గురిచేసింది. త్రిబుల్ ఫోర్ సర్వే నంబర్లు సోమవారం 3 ఎకరాల్లో భారీ స్థా యిలో ఇరిగేషన్ పరిధిలోని వంతెనను సై తం ఆక్రమించి రిసాక్టులకు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల సహాయ సహకారాలు దం డిగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

బ డా వ్యాపారి మంత్రులను సైతం తప్పుదోవ పట్టించి పట్టణ పరిధిలో అనేక ప్రభుత్వ నేటి పారుదల శాఖ భూముల్లో అక్రమ కట్టడా లు నిర్మించి సొమ్ము చేసుకుంటున్న తీరు ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవానికి  అంగీకరించే ముందు పూర్తి సమాచారం తెలుసు కుని అన్ని అనుమతులు ఉన్నాయో లేదో వాకప్ చేసి ప్రారంభోత్సవానికి వస్తే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

అ లాంటివేమీ పరిశీలించకుండా తగుదున మ్మా అంటూ వచ్చే రిబ్బన్ కట్ చేస్తే అక్రమార్కులకు అంగ, ఆర్థిక బలాన్ని చేకూర్చిన వారు అవుతారనే విమర్శలు వస్తున్నాయి. అక్రమార్కులు పట్టించే తప్పు దోవలో ప్రజాప్రతినిధులు తీవ్ర విమర్శలను ఎదుర్కో వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అక్రమార్కు ల తెగింపుకు పాల్వంచ రెవెన్యూ మున్సిపల్ అధికారులతో పాటు ప్రజాప్రతినిలే కారణమని పట్టణ ప్రజలు బహిరంగంగా చర్చిం చుకుంటున్నారు. 

అక్రమార్కులు ఇచ్చే భార్య ముడుపులకు అధికార తలవగి భావితరాలకు ఉపయోగపడే విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేస్తున్నారంటూ ప్రజ లు మండిపడుతున్నారు. ఎప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించి వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.