20-05-2025 11:17:50 PM
ముత్తారం మండల కాంగ్రెస్ నాయకులు..
ముత్తారం (విజయక్రాంతి): దుద్దిల్ల కుటుంబాన్ని విమర్శించే నైతిక హక్కు పుట్ట మధుకు లేదని ముత్తారం మండల(Mutharam Mandal) కాంగ్రెస్ నాయకులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య, మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజీ పాషా మాట్లాడుతూ... పుట్ట మధు నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది దుదిళ్ల కుటుంబం కాదా... అది మర్చిపోయి మతిభ్రమించి మాట్లాడుతున్నావని, ప్రోటోకాల్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని, దళితుల గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లిచినట్టే ఉంటుంది నీవు అధికారంలో ఉండంగా ఎంతమంది దళితులపై దాడులు జరిగినాయో అప్పుడే మర్చిపోయావా... అధికారం కోల్పోయిన తర్వాత జనాలు నిన్ను మర్చిపోయిన సందర్భంలో నీవు మతిభ్రమించి మాట్లాడుతూ నేను కనీసం సోషల్ మీడియాలో నైనా ఉండాలి లేకపోతే నన్ను జనాలు మర్చిపోతారని భయంతోనే దుదిల్ల కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తే ఖబర్దార్ పుట్ట మధు అన్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీమతి శైలజ రామయ్య గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఎంత నిబద్ధతతో పనిచేశారో, ఎలాంటి చిన్న ఆరోపణ లేకుండా మహోన్నతమైన వ్యక్తిపై ఆరోపణ చేయడం నీ అవివేకం వారిని విమర్శిస్తే స్థాయి కూడా నీది కాదు. మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలుపుతున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ప్రియతమ నాయకులు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చేసే అభివృద్ధిని ఓర్వలేక ప్రజల్లో కనుమరుగైతనని భయంతోనే మాట్లాడుతున్నావు.
అలాగే మా నాయకులు శ్రీనుబాబు పై కూడా విమర్శ చేస్తున్నావ్, శ్రీను బాబు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి హాస్పటల్ గాని ఇంకా ఏ అవసరాలు పడినా ఫోను చేసిన వెంటనే పనులు చేస్తున్నటువంటి మహా నాయకులు, వారు కూడా ప్రజల్లో మమేకమైతున్నారని గమనించి దుదిల్ల కుటుంబం ప్రజా సేవకు అంకితమవుతున్నారని తట్టుకోలేక మతిభ్రమించిన వ్యక్తిలాగా మాట్లాడుతున్న పుట్ట మధు ఇంకొకసారి దుదిళ్ల కుటుంబంపై ఎలాంటి ఆరోపణ చేసిన తీవ్ర పరిమాణాలు ఉంటాయని ముత్తారం మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బక్కతట్ల వినీత్ , ముత్తారం గ్రామ శాఖ అధ్యక్షులు అనుము సమ్మయ్య, ఓడేడు గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి చంద్రమౌళి, మాజీ సర్పంచులు రజిత రఫీ, రాపల్లి రామన్న, సంపత్ రావు, తాటిపాముల శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషన్ మల్లెల రాజయ్య, శేఖర్, ఆకుజ అశోక్, మండల రవీందర్, తోడేటి శశికుమార్, నెత్తెట్ల కిరణ్, బత్తుల సది, యూత్ కాంగ్రెస్ నాయకులు లక్కం ప్రభాకర్, అనుప్రశాంత్. తదితరులు పాల్గొన్నారు.