02-08-2025 06:29:33 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): కార్మిక రాజ్యస్థాపన ధ్యేయంగా విప్లవ కార్మిక సంఘాన్ని అంటిపెట్టుకొని సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషిచేసిన కార్మిక ఉద్యమ నేత తెలబోయిన లక్ష్మయ్య ఆశయ సాధనలో ముందుకు సాగాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాస్ పిలుపునిచ్చారు. లక్ష్మన్న విద్యార్థి దశ నుండే విప్లవోద్యమంలో అలుపెరుగని పోరాటాలు నిర్వహించి కార్మిక రాజ్య స్థాపనే దేయంగా విప్లవ కార్మిక సంఘాన్ని అంటిపెట్టుకొని సమ సమాజ స్థాపన, నూతన ప్రజాస్వామిక విప్లవమే తన శ్వాసగా పనిచేస్తూ మన నుండి దూరమైనప్పటికీ ఆయన కలలుకన్న లక్ష్యసాధన విప్లవ మార్గమే ఈ దేశానికి విముక్తి మార్గమని పేర్కొన్నారు.
ఆయన ఆశయ సాధన కోసం ఆయన అందించిన జెండాను ముందుకు తీసుకు వెళ్లినప్పుడే ఆయన కందించే నిజమైన నివాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు ఏపూరి వీరభద్రం, హళావత్ లిగ్యా, జిల్లా అధ్యక్షులు పర్వత కోటేష్, జిల్లా కార్యదర్శి శివారపు శ్రీధర్, సహాయ కార్యదర్శి మదంశెట్టి నాగేశ్వరరావు, తేజావత్ శోభన్, ఎండి జబ్బర్, అల్లి యాకాంబరం పాల్గొన్నారు.