02-08-2025 06:32:20 PM
జిల్లా రవాణా అధికారి బద్రు నాయక్..
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): నివారణకు డ్రైవర్లు మరింత కృషి చేయాలని జిల్లా రవాణా అధికారి బద్రునాయక్(District Transport Officer Badru Nayak) అన్నారు. శనివారం జగిత్యాల ఆర్టీసీ డిపోలో ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రవాణా అధికారి డ్రైవర్లకు పలు సూచనలు చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ ఉపయోగించరాదని, మద్యం తాగి బస్సును నడపకూడదని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. డ్యూటీకి వచ్చేటప్పుడు ప్రశాంతమైన మనసుతో, ఏకాగ్రతతో రావాలన్నారు. వర్షాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. కండక్టర్లు చూడకుంటే బస్సు రివర్స్ తీయవద్దని చెప్పారు. ప్రమాదాల నివారణకు అన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంవిఐ లు రామారావు, ప్రమీల, షేక్ రియాజ్, డిపో మేనేజర్ కల్పన, ఏ ఈ ఎం కవిత, సేఫ్టీ వార్డెన్ ఎస్ జె రెడ్డి తదితరులు పాల్గొన్నారు.