calender_icon.png 2 August, 2025 | 8:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సరఫరాకు వారం పాటు అంతరాయం..

02-08-2025 06:22:41 PM

మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీకి ఆడ ప్రాజెక్టు నుంచి సరఫరావుతున్న తాగునీటికి అంతరాయం ఏర్పడుతుందని బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్(Municipal Commissioner Thanniru Ramesh) పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. అడ ప్రాజెక్టులో చెత్త పేరుకుపోయిన నీటి సరఫరాకి అవరోదంగా మారిందని తెలిపారు. ఆసిఫాబాద్ అడా ప్రాజెక్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నది ఇన్స్టిక్ వద్ద భారీ మొత్తంలో చెత్త పేరుకుపోయిందనీ ఆయన తెలిపారు. నీటి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల కారణంగా రాబోయే ఒక వారం రోజుల పాటు నీటి సరఫరా సక్రమంగా ఉండదని వెల్లడించారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఈ విషయాన్ని పట్టణ ప్రజలు గమనించాలని కోరారు.