calender_icon.png 2 August, 2025 | 8:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా జరిగిన న్యాయ సదస్సులో డాక్టర్ కోట నీలిమ

02-08-2025 06:26:51 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): ఏఐసీసీ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో జరిగిన న్యాయ సదస్సులో పీసీసీ లీగల్ సెల్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ(PCC Legal Cell Incharge Dr. Kota Neelima) పాల్గొన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటికి పరిష్కార మార్గాలు అనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగిందన్నారు. ఇలా న్యాయపరమైనటువంటి అంశాలపై జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఎజెండా అంశాలపై సదస్సులో ప్రసంగించారని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ న్యాయమూర్తులు, న్యాయవేత్తలు, సామాజిక వేత్తలు పాల్గొన్నారని చెప్పారు. ముందుగా సామాజిక న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వ భావనలు, మతం, నియంత్రణలు, మార్గదర్శకాలు, అధికార విభజన, ప్రజాస్వామ్య బాధ్యత, సమాఖ్య వ్యవస్థ దిశ, న్యాయ స్వతంత్రత, రాజ్యాంగ సంస్థల అశక్తతపై చర్చ, వాలెడిక్టరీ సెషన్, రాజ్యాంగ దిక్సూచి, ప్రజాస్వామ్య భారత పట్ల కాంగ్రెస్ నిబంధిత విధేయత అంశాలపై చర్చ జరిగిందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ఇతర న్యాయ నిపుణులు ప్రజలకు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారన్నారు. ఢిల్లీలో జరిగిన ఈ సభ పార్టీ సదస్సులా కాకుండా దేశ రాజ్యాంగాన్ని కాపాడేందుకు అవసరమైన చర్చలకు అవకాశం కల్పించిన బహుముఖ వేదికగా నిలిచిందని తెలిపారు డాక్టర్ కోట నీలిమ.