calender_icon.png 2 August, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి

02-08-2025 06:37:34 PM

తిరుమలగిరి(సాగర్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంలో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి(MLA Kunduru Jayaveer Reddy) తిరుమలగిరి మండలం లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొత్త రేషన్ కార్డులతో పేదల జీవితాల్లో నూతన ఆశలు వెల్లివిరిసిందని అన్నారు. గడిచిన పదేండ్ల పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. నూతన రేషన్ కార్డులు ఇచ్చి పేదలకు అండగా ప్రజా ప్రభుత్వంగా ప్రజలలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. మండలంలో సుమారు 1557 నూతన ఆహార భద్రత కార్డులను(రేషన్ కార్డులు) పంపిణీ చేశారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, జిల్లా పరిషత్ మాజీ జడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగా రెడ్డి, హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్, మాజీ ఎంపీపీ భగవాన్ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు క్రిష్ణ నాయక్, నాయకులు వల్లభ రెడ్డి, లాలూ నాయక్, రాఘవ రెడ్డి, పాండు నాయక్, ముని నాయక్, మండల ప్రత్యేక అధికారి సతీష్, తహసీల్దార్ అనిల్, ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.