02-08-2025 06:43:42 PM
విద్యాశాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటు..
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్..
కరీంనగర్ (విజయక్రాంతి): భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ శంకరపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్ లో విద్యార్థులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్(SFI District President Kampelli Aravind) మాట్లాడుతూ, విద్య రంగ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న విద్యాశాఖకు మంత్రిని కేటాయించుకోకపోవడం సిగ్గుచేటు అని వారు అన్నారు, విద్యా వ్యవస్థను పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం పైన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి సమస్యలు అక్కడే కళాశాలలో విపరీతంగా ఉన్నాయి వీటిని పర్యవేక్షించడానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఏ విధంగా సమస్యలు పరిష్కారం అవుతాయని వారు అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో సమస్యలతో అకాడమిక్ ప్రారంభం అయ్యింది, విద్యార్థులు కేవలం ఓట్లకు మాత్రమే పనికి వస్తారా? విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఏ మాత్రం కూడా సోయిలేని నాయకులు ప్రజాప్రతినిధులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారని వారు అన్నారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పూర్తిస్థాయిలో మర్చిపోయిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమలు చేస్తా అని వాగ్దానం గానే మిగిలిపోయింది.కావున తక్షణమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు గన్నరపు రాకేష్ ,మండల నాయకులు అఖిల్,ఇమ్రాన్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.