28-12-2024 12:00:00 AM
మనం ఇష్టపడే వారితో కలిసి జీవించడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. వారితో జీవించే ప్రతి నిమిషం కొత్తగా ఉంటుంది. భారతీయ సంప్రదాయం ప్రకారం ఒకప్పుడు వివాహం చేసుకున్నాకే ఒక స్త్రీ పురుషుడు కలిసి జీవించేవారు. ప్రస్తుతం పూర్తిగా మారిపోయింది. ఇద్దరూ ఇష్టపడితే వివాహంతో సంబంధం లేకుండా ముందే సహజీవనంలో ఉంటున్నారు.
ఇలా కొన్నేళ్ల పాటు లేదా కొన్ని నెలల పాటు లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు వివాహం చేసుకుంటే.. ఆ వివాహం కలకాలం నిలుస్తుందనే అభిప్రాయం ఎక్కువమందిలో ఉంది. ఇది విడాకులను తగ్గిస్తుందని కూడా చెప్పుకుంటున్నారు. సహజీవనం అనేది పూర్తిగా విడాకులను తగ్గిస్తుందని చెప్పలేము. కానీ ఒకరంటే ఒకరికి పూర్తిగా అర్థం అయ్యేలా చేస్తుంది. కలిసి జీవించడం వల్ల పెళ్లికి ముందే జంటలు ఒకరి దినచర్యలు, అలవాట్లను మరొకరు తెలుసుకుంటారు. వారికి నచ్చని విషయాలను చెప్పుకుంటారు. నచ్చే విషయాలను నేర్చుకుంటారు. దీనివల్ల కొంతమేరకు ఉపయోగం ఉంది.