28-12-2024 12:00:00 AM
నారింజ పండ్లు ఆరోగ్యానికి మంచివి. ఈ పండ్లను తినడం వల్ల జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. దీనిలో మనకి కావల్సిన బీటా కెరోటిన్, పొటాషి యం, మెగ్నీషియం ఉంటాయి. నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఆకలిని అరికట్టి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. సిట్రస్ ఫ్రూట్ అయిన నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
దాంతో శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ పండ్లలోని ఫోలేట్, రాగి వంటి అనేక పోషకాలు ఇమ్యూనిటీని పెంచి ఆరోగ్యవంతంగా ఉంచడం లో సాయపడతాయి. వీటి వల్ల డిప్రెషన్, మానసిక ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. గర్భిణులకు పుల్ల పుల్లగా తినాలి అనిపించడం సహజం. నారింజ ఎక్కువగా తినడం వల్ల కడుపు లో బిడ్డ బలంగా పెరిగేందుకు దోహదపడుతుంది.
బ్రెయిన్ కూడా బాగా డెవలప్ అవుతుంది. దీనిలో ఉండే విటమిన్ బి , ఫోలేట్ లు డీఎన్‌ఏను తయారుచేయడానికి ఉపయోగపడతాయి. నారింజ పండ్లు మెడిసిన్స్‌తో సమానం అని చెప్పడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పండును తింటే శరీరం లోని చక్కెర స్థాయి తగ్గుతుంది.