23-09-2025 12:00:00 AM
బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళా ఐక్యత, సంస్కృతి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి జీవచి హ్నం. ఇది భూమి, నీరు, ప్రకృతిని దైవీకరించి ఆరాధించే పండగ. రాష్ర్టంలో ఆడప డుచులందరూ ఘనంగా జరుపుకునే పూ ల పండగ బతుకమ్మ. వేములవాడ చాళుక్యుల పాలనా కాలంలోనే బతుకమ్మ పం డుగ ప్రారంభమైందని చరిత్రకారులు అభిప్రాయం.
ప్రకృతిలో పూసే తంగేడు, గుమ్మడి ,పట్టుకుచ్చు, తామర, మందార, టేకు, బంతి, చామంతి పూలను గుమ్మడి ఆకుల్లో పేర్చి బతుకమ్మ పండగను జరుపుకుంటారు. ఇది మహాలయ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు జరుగుతుం ది. తొమ్మిది రోజులు 9 రకాల ఫల హారా లు తయారుచేసి బతుకమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. తెలంగాణ భాషలో దీనినే సత్తు అంటారు. బతుకమ్మ నిమజ్జనం త ర్వాత అందరు కలిసి తింటారు. మహిళలు అందరూ కలిసి ఒకేచోటుకు చేరి బతుకమ్మ పాటలు పాడుతూ వేడుకగా జరుపు కుంటారు.
అంతటి విశిష్టత ఉన్న బతుక మ్మ పండుగ మెల్లిగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తుంది. ఇటీవల ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో ఎక్కడ చూసినా దా దాపు డీజే మోతలు, దాండియా ఆటలే క నిపిస్తున్నాయి. సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ అందుకు అ నుగుణంగా కాళ్లు కదిపే మహిళల సంబరాలు కనుమరుగయ్యాయి. ‘రానూ బొం బైకి రానూ’ అంటూ పొంతనలేని పాటలతో మహిళలు, యువతులు బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ సందర్భంగా బతుకమ్మ ప్రా శస్త్యం ఎటు పోతుందనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరముంది.
ప్లాస్టిక్ బతుకమ్మలు
గతంలో బతుకమ్మ పండగ అంటే మ హిళలు పాడే పాటల్లో మన తెలంగాణ ప్రజల కష్ట, సుఖాలు, కుటుంబ సభ్యుల మధ్య అనురాగాలు, బంధాలు, ప్రకృతి వర్ణన ఉండేది. ముఖ్యంగా భూస్వామ్య పె ట్టుబడిదారులకు వ్యతిరేకంగా రాసిన గే యాలు, వీరుల గొప్పతనాలు వంటివి ఎ న్నో నిగూఢంగా ఉండేది.
సాంస్కృతిక వా రసత్వం, వీరుల పోరాటం వంటివి నేటి ఆధునిక పోకడలతో సాగుతున్న బతుకమ్మ ఆటలో కనుమరుగవుతున్నాయి. బ తుకమ్మ పోరాట స్ఫూర్తి దెబ్బతింటుంది. ఈ తరంతోనే బతుకమ్మ గొప్పతనం అం తమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కొన్నేళ్ల కింద బతుకమ్మ పండుగ వస్తుందంటేనే పిల్లా, జల్లా, పెద్దా అనే తేడా లేకుండా వివిధ రకాల పూల కోసం అడవుల్లో జల్లెడ పట్టేవారు.
బతుకమ్మలో వి రివిగా ఉపయోగించే తంగేడు, గునుగ పు వ్వు, పట్టుకుచ్చు పువ్వుల కోసం పోటాపో టీ పరుగులు కనిపించేవి. మధ్యాహ్నం అ దంగా రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఊరి మహిళలు తమ నెత్తిన పెట్టుకొని ఊరేగింపుగా చెరువుల వద్దకు వెళ్లేవారు. సంధ్యా సమయం వరకు ఆట పాటలు ఆడి ఆ త ర్వాత బతుకమ్మలను నిమజ్జనం చేసేవా రు. ఐక్యతకు చిహ్నంగా నిలిచే ఈ పూల న్నీ వాగులో నిమజ్జనం ద్వారా అవి కూ డా శుభ్రంగా మారేవని నమ్మకం.
అయితే టెక్నాలజీ మారుతున్న కొద్ది అడవులు నశిస్తుండడంతో ప్రజలు కృత్రిమం వైపు మొ గ్గు చూపడం అలవాటుగా మార్చుకున్నారు. దీని ఫలితమే నేడు బతుకమ్మ పే ర్చడానికి వాడే పూలలో ఎక్కువగా ప్లాస్టిక్ ఉపయోగించడం, హానికరమైన రంగులు వాడడం చూస్తున్నాం. ఇవి వాగులో నీటికి హాని కలిగించేవిగా ఉన్నాయి. ఈ హానికర రంగుల వల్ల జలచరాలకు నష్టం కలిగే అవకాశం ఉంది. కావున కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
డీజే పాటలు.. దాండియా ఆటలు
ఒకప్పుడు బతుకమ్మ ఆటలో ఆడవాళ్ళందరూ వయస్సుతో సంబంధం లేకుం డా వినసొంపైన గానంతో, చప్పట్లతో ఒక లయతో ఆడేవారు. పల్లె, పట్టణాలు అనే తేడా లేకుండా ఇది చూడడానికి ముగ్ధ మ నోహరంగా కనిపించేది. కానీ నేటి యువతలో ఇవన్నీ కనిపించడం లేదు. ఎంతసేపు డీజే పాటలు, సంబంధం లేని నృత్యాలు చేస్తూ బతుకమ్మకు ఉన్న విలువను పాడు చేస్తున్నారు.
అసలు బతుకమ్మకు సంబం ధం లేని పాటలు పెట్టి డ్యాన్స్‌లు చేస్తున్నా రు. మరోవైపు ఉత్తర భారతదేశ నృ త్యా లైన దాండియా, గార్బా వంటి నృత్యా లు కూడా బతుకమ్మ పండగలోకి ప్రవేశిస్తున్నాయి. గతంలో మహిళలు మాత్రమే ఆడుకునే బతుకమ్మలోకి నేడు పురుషులు కూడా ప్రవేశిస్తున్నారు. కోలాటం బదులు దాండియా అంటూ ఉత్తర భారత సంప్రదాయాలను ఇక్కడ నూరిపోస్తున్నారు.
ఇ వన్నీ బతుకమ్మ పండగ ఉనికిని దెబ్బతీసే అవకాశం ఉంది. బతుకమ్మ పండుగ తె లంగాణ మహిళల సంఘీభావానికి, బ హుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మను అస్తిత్వా నికి ప్రతిగా చెప్పేవారు. ఇక పండుగ సీజన్‌లో వ్యాపార ధోరణి కూడా బతుకమ్మపై ప్రభావం చూపిస్తుంది. నేడు జరుగుతున్న బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళ లు ఆటల కన్నా వాళ్లు ధరించే బంగారం, చీరలపైనే దృష్టి సారిస్తున్నారు. ఇది ప్రజ ల్లో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీ య అంతరాలకు కారణమవుతుంది.
బతుకమ్మతో రాజకీయం
బతుకమ్మ తెలంగాణ ప్రజల సంస్కృతికి, మహిళల ఐక్యతకు చిహ్నంగా ఉండే ది. ఇటీవలే దీనిని రాజకీయ క్రీడగా మా ర్చేశారు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే బ తుకమ్మ పండుగ ఎన్నికల ప్రచారాలకు కూడా వేదికగా మారిపోవడం శోచనీయం తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ర్ట ప్ర భు త్వం బతుకమ్మను రాష్ర్ట పండుగగా అధికారికంగా నిర్వహిస్తోంది. గతంలో బీఆర్‌ఎ స్ ప్రభుత్వంలో తెలంగాణ జాగృ తి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగేవి.
ఇ ప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం రాజకీ య రంగును ఇనుమడింపచేస్తుందనే వి మర్శలు ఉన్నాయి. బతుకమ్మను రాజకీయాలకు దూరంగా ఉంచితేనే మం చిది. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా బతుకమ్మను జరుపుకోవాలి. బ తుక మ్మ అనేది బహుళ రాజకీయ హ క్కుల సాధనకు, సంస్కృతిని కాపాడేలా, స్వాభిమానాన్ని ప్రపంచానికి తెలియజేసే గొప్ప వేదికక కావాలి. అన్ని రంగాల్లో మ హిళా సమానత్వం, సాధికారతే మనం బతుకమ్మకు ఇచ్చే గౌరవమన్న విషయం గుర్తుంచుకోవాలి.