calender_icon.png 27 September, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటు విలువపై సంస్కరణలు

23-09-2025 12:00:00 AM

భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. ప్రజాస్వామ్యానికి మూల స్తంభం మన ఎన్నికల వ్యవస్థ. ఎ న్నికల సంఘం భారత రాజ్యాంగం ఆర్టిక ల్ 326 ద్వారా కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష, అక్షరాస్యులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా.. 18 సంవత్సరాల వ యస్సు నిండిన ప్రతీ పౌరుడికి వయోజన ఓటు హక్కును కల్పించింది.

ప్రపంచ రాజకీయ చరిత్రలో గొప్ప విప్లవాత్మకమైన మార్పు ఓటుహక్కు. అభివృధి చెందిన దేశాల కంటే ముందే మన దేశంలో వ యోజన ఓటు హక్కును భారత రాజ్యాం గం కల్పించి ప్రజాస్వామ్య వ్యవస్థకు పునా ది వేసింది. ఓటు హక్కుతో ప్రజాస్వామ్యాయాన్ని పరిపుష్టం చేసే అవకాశం పౌరు లందరికీ కల్పించింది. ఐదేళ్లకు ఒకసారి జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కును వియోగించుకోవడంతో పాటు తాము కోరుకున్న పాలనను  ప్రజలే తెచ్చుకోవ చ్చు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉం ది అన్న విషయాన్ని ఓటు చాటుతుంది.

ఓటు రూపంలో భవిష్యత్తుకు మనమే బా ట వేసుకునే అవకాశాన్ని రాజ్యాంగం క ల్పించింది. ఓటు అనే రెండు అక్షరాలు దేశ చరిత్రను మార్చి వేస్తుంది. ప్రభుత్వాలను కూలదోస్తుంది. ఓటు తూటా కంటే గొప్ప ది. ఓటు హక్కు వజ్రాయుధం. ఓటు హ క్కును వినయోగించు కోవడం ప్రజల ప్ర ధాన  కర్తవ్యం. ఓటు హక్కుపై విస్తృత ప్రచారంచెయ్యాలి. కుల మతాలకు అతీతంగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

ఎన్నికలపై అనాసక్తి

భారతదేశంలో 2024 జనవరి 1 నా టికి నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 97,79,65,560కు చేరింది. దేశంలో జనాభాతో పాటు ఓటర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచటానికి కేంద్ర ఎన్నికల సం ఘం (ఈసీ) అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఎన్నిక ల సంఘం ఓటింగ్‌పై అవగాహన కలిగిస్తున్నప్పటికీ ప్రతీసారి జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే ఓటర్లలో మూడో వం తు ప్రజలు పోలింగ్‌కు దూరంగా ఉం టున్న పరిస్థితి నెలకొంది.

దేశంలో 1951 నాటికి నమోదైన  ఓటర్ల సంఖ్య 17.32 కోట్లు ఉండగా.. 2023 నాటికి ఈ సంఖ్య 94.50 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని యువకులు ఓటేయడానికి ఆసక్తి చూపడం లేదు. గత లోకసభ సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు మూడో వంతు ఓటర్లు పోలింగ్‌కు దూరం గా ఉన్నారని ఎన్నికల కమిషన్ పేర్కొనడం గమనార్హం.  భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉంటే.. అందులో 45.57 శాతం మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దశాబ్దాలుగా దేశంలో ఓటర్ల సం ఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ ఓటు హక్కు వినియోగించుకునే సంఖ్య మాత్రం అంతకంతకూ పడిపోతుండడం శోచనీ యం.

ఇక 1957లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 19.37 కోట్లు ఉం డగా.. అందులో 47.74 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివ రకు జరిగిన సాధారణ ఎన్నికలకు ముం దు ప్రతీసారి పోలింగ్ శాతాన్ని 75 శాతానికి పెంచాలని ఎన్నికల సంఘం చేస్తున్న కసరత్తులు వృథాగా మారిపోతున్నాయి. 2014లో దేశంలో నమోదైన ఓటర్ల సం ఖ్య 83.4౦ కోట్లు ఉంటే పోలింగ్ శాతం మాత్రం 66.44గా వుంది. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నమోదైన మొత్తం ఓటర్ల సంఖ్య 91.2 కోట్లుగా ఉంటే.. పోలిం గ్ శాతం 67.4 శాతానికి మించలేదు.

2019 సార్వత్రిక ఎన్నికల్లో 30 కోట్ల మం ది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారని, కనీసం పోలింగ్ బూత్‌కు వెళ్లేందుకు కూడా ఇష్టపడడం లేదని ఎన్నికల కమిషన్ నిర్ధారిం చింది. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 97.79 కోట్లు ఉంటే.. ఓటింగ్ శాతం 66.10 శాతం నమోదైంది. 2019తో పోలిస్తే ఓటింగ్‌లో 1.30 శాతం తగ్గడం గమనార్హం. కుళ్లిన రాజకీయాలు, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పార్టీలు, అభివృద్ధి పేరుతో కాలాయాపన చేయడం వంటివి నిశితంగా గమనించిన ప్రజలు, యువతీ యువకులు ఓటు వేసేందుకు ఇష్టపడడం లేదని ఈసీ పేర్కొంది. 

రిమోట్ ఓటింగ్ విధానం

ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఇటీవలే కేంద్ర ఎన్నికల సంఘనం నూతన సంస్కరణలను తీసుకొచ్చే పనిలో పడింది. ఇందులో భాగం గానే సొంత రాష్ర్టంలో ఓటరుగా నమోదైన వారు వివిధ కారణాల వల్ల వేర్వేరు చోట్లకు వలస వెళ్లినవాళ్లు ఓటు హక్కు వి నియోగించుకునే  స్థితిలో లేరు. వీరి కోసం కేంద్ర ఎన్నికల సంఘం రిమోట్ ఓటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది. వినూతనమైన కమ్యూనికేషన్ వ్యూహాల మీద ఎ న్నికల కమిషన్ దృష్టి సారించింది.

అయితే రిమోట్ ఓటింగ్ విధానంపై దేశం లో ఉన్న జాతీయ, ప్రాంతీయ, ఉప ప్రాం తీయ పార్టీల ఏకాభిప్రాయం అవసరం. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ విధానం తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రిమోట్ ఓటింగ్ విధాన ప్రక్రియ ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని అనుకుంటుంది. అ యితే ఎన్నికల కమిషన్ ప్రతిపాదించిన రి మోట్ ఓటింగ్ సంస్కరణలపై గతాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రాజకీయ పార్టీ లు ఈసీ అభిప్రాయానికి మద్దతు తెలిపిన దాఖలాలు తక్కువగానే ఉన్నాయి.

ప్రపం చ వ్యాప్తంగా వివిధ దేశాల్లో భారత్‌కు చెందిన 2.2 కోట్ల మందికి పైగా ఎన్నారై ఓటర్లు ఉన్నట్లు అంచనా. ఎన్నారై ఓటర్లకు సంబంధించి త్వరలోనే ఒక చట్టం తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వి దేశాల్లో ఉన్న ఎన్నారైలు భారత్‌లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఆన్‌లైన్ ఓటింగ్ వి ధానం ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

ఓటింగ్ పెరగాలంటే

ఎన్నికల కమిషన్ నిరంతరం ఓటర్ల నమోదుతో పాటు కొత్త ఓటర్ల చేరికలు పరిశీలించడంతో పాటు డుప్లికేట్, దొంగ ఓటర్లను క్రాస్ చెక్ చేసుకుంటూ  ఓటర్ల జాబితా నుంచి తొలగించే కార్యక్రమాన్ని  సమర్థవంతంగా చేపట్టాలి. కళాశాల స్థా యిలో ఓటర్ల నమోదు కేంద్రాలను ఏర్పా టు చెయ్యాలి. ఎలక్షన్ లిటరసీ క్లబ్‌లను ని ర్వహించాలి.  బలమైన ప్రజాస్వామ్యం కోసం ఎన్నికల అక్షరాస్యత పరివ్యాప్తిలో యువజన, మహిళలు, స్వశక్తి సంఘాలు, పౌర సమాజం, స్వచ్ఛంద, సామాజిక సే వా సంస్థలు క్రియాశీలక పాత్ర పోషించా లి.

ప్రభుత్వం నిర్బంధ ఓటింగ్ విధానం అమల్లోకి తీసుకురావాల్సిన అవసరముం ది. అందుకు అవసరమగు బిల్లును లోకసభలో ప్రవేశ పెట్టి సమగ్ర ఎన్నికల చట్టాల ను రూపొందించాలి. మాజీ రాష్ర్టతి అబ్దు ల్ కలాం పేర్కొన్నట్లు ఎన్నికల్లో 90 శాతం ఓటింగ్ జరిగినప్పుడే  దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నట్టుగా భా వించాలని ఆయన పేర్కొన్న వ్యాఖ్యలతో ఓటర్లకు కనువిప్పు కలిగించాలి. ముఖ్యం గా యువతను ఓటువైపు మళ్లించేందుకు ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరముంది. అంతేకాదు వారికి ఓటు విలువపై అవగాహన కలిగించాలి.

ప్రజాస్వామ్యానికి ఓటు వజ్రాయుధం. ఓటు హక్కు వినియోగంతో పాటు దొంగ ఓట్లపై అవగాహన కల్పిస్తూ ప్రతి మూడు నెలలకోసారి గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిం చడంతో పాటు, పురపాలక, నగర పాలక సంస్థల్లోనూ తరచూ సమావేశాలు నిర్వహించి చైతన్యం కలిగించాలి. ఓటు హక్కు వినియోగంపై అవసరమైతే  మీడియా సాధనాలైన పేపర్, టీవీలతో పాటు డిజిటల్ మీడియాలోనే విస్తృత ప్రచారం చేయాలి. ‘ఓటు వేయడానికి మేము సిద్ధం’ అనే నినాదం ఓటర్లలో పాతుకుపోయేలా చేయాలి. బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ లో నిజమైన ప్రగతి, పురోగతి, సంక్షేమం సిద్ధించినప్పుడే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమౌతుంది.

వ్యాసకర్త సెల్: 9440245771