27-04-2025 12:00:00 AM
ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగ
అవకాశాలు ఇప్పుడు ఎక్కువగానే ఉంటున్నాయి. పని ప్రదేశం అందుకు తగ్గట్టు లేకపోతే ఏకాగ్రత దెబ్బతింటుంది. ఒత్తిడి, తప్పక పోవచ్చు. కాబట్టి ఇంట్లో దీనికంటూ ఓ ప్రత్యేక స్థ లాన్ని ఎంచుకోవాలి. మనసుకు నచ్చేలా మాత్రమే కాకుండా మెదడు ఉత్సాహంగా పనిచేసేలా సర్దుకోవాలి.
వర్క్‌ఫ్రమ్ హోమ్ చేసేందుకు.. ఇంటి మధ్యలో ఉండే గదిని ఎంచుకోవద్దు. బెడ్‌రూమ్‌కి పక్కగా ప్రశాంతంగా ఉండే చోట ఇందుకు ఏర్పాట్లు చేసుకోండి. ఆకర్షణీయంగా ఉండే రంగులూ, కోట్స్‌తో తీర్చిదిద్దితే స్ఫూర్తివంతంగా ఉంటాయి. రంగులు మనసుని ఉల్లాసంగా ఉంచుతాయి. పని ఒత్తిడిని దూరం చేస్తాయి.
గది చిన్నదైనా..
గదిలో అలంకరణగా సర్దే వాల్ హ్యాంగింగ్స్ నుంచి టేబుల్‌పై అమర్చే పుస్తకాలు, ఫైల్స్ ఆర్గనైజర్, ల్యాంప్, మౌస్‌ప్యాడ్, పెన్ హోల్డర్, టేబుల్ క్లాక్, ఆర్గనైజర్ ట్రే వంటి వస్తువులన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కలర్స్‌లో ఉంటే ఆ ప్రాంతం మరింత అందంగా మారిపోతుంది. ఇది గది రూపురేఖాల్ని మార్చేస్తుంది.
రంగులమయం..
టేబుల్‌కు పక్కగా ఉండే అల్మారాలో రంగురంగుల తొట్టెల్లో ఇండోర్ పూలమొక్కలు సర్దాలి. సౌకర్యవంతంమైన డెస్క్ చెయిర్ సౌకర్యంగా ఉంచుతుంది. ఇక గది కిటికీకి విలక్షణమైన డిజైన్స్ ఉన్న ముదురు. లేత రంగుల కలయికతో ఉన్న కర్టెన్లు వేస్తే చాలు. రోజంతా పని చేసినా అలసటగా అనిపించదు. పనిలో నాణ్యతా పెరుగుతుంది.