calender_icon.png 1 May, 2025 | 8:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇలా ఉంటేనే.. అందం

27-04-2025 12:00:00 AM

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి పుష్కలంగా నీరు తాగాలి. రోజుకు కనీసం 8 గ్లాసులైనా తీసుకోవాలి. దీనివల్ల శరీరం నుంచి టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి. చర్మం లోపలి నుంచి హైడ్రేటెడ్‌గా మారుతుంది. 

నీటిశాతం అధికంగా ఉండే దోసకాయలు, పుచ్చకాయ, నారింజ, స్ట్రాబెర్రీలను ఎక్కువగా తీసుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా.. చర్మానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి.

ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి యూవీ కిరణాల నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. విటమిన్ సి.. శరీరంలో ఫ్రీరాడికల్స్‌తో పాటు మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. నల్లమచ్చలు రాకుండా కాపాడుతుంది. 

ఇక ఎక్కువ సమయం ఏసీ గదుల్లో ఉన్నా.. చర్మం పొడిబారుతుంది. ఏసీల నుంచి వచ్చే పొడిగాలి.. చర్మంలో తేమను తొలగిస్తుంది. కాబట్టి.. ఇంట్లో, ఆఫీసులో హ్యూమిడిఫయర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి. ఇవి గాలికి తేమను అందించి.. చర్మం ఎక్కువ పొడిగా మారకుండా నిరోధిస్తాయి.

చర్మ సంరక్షణ కోసం కలబంద వంటి హైడ్రేటింగ్ పదార్థాలను కలిగిన మాయిశ్చరైజర్లు వాడాలి. ఇవి చర్మం తేమను కోల్పోకుండా కాపాడతాయి. చర్మాన్ని మృదువుగా మార్చడంలో సహాయపడతాయి.

వేసవిలోనే కాదు.. ఏడాదంతా సన్‌స్క్రీన్ లోషన్ వాడటం మంచిది. ఇది హైపర్‌పిగ్మెంటేషన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. రసాయనాలు తక్కువగా ఉండే ఉత్పత్తులను ఎంచుకోండి. ఇక వేసవిలో ప్రతి రెండుమూడు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ లోషన్‌ను అప్లయి చేస్తూ ఉండాలి.