calender_icon.png 26 July, 2025 | 1:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మందమర్రి ఏరియాలోని ఎల్లందు క్లబ్ లో 23వ త్రైపాక్ష

25-07-2025 08:28:14 PM

రక్షణ సూత్రాలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలి

డిఎంఎస్ ఎన్ నాగేశ్వర రావు

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి సంస్థలో  భూగర్భ గనులు, డిపార్ట్ మెంట్ లలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు రక్షణ సూత్రాలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తికి కృషి చేయాలని హైదరాబాద్ రీజియన్ సౌత్ సెంట్రల్  జోన్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (మైనింగ్)  ఎన్ నాగేశ్వరరావు కోరారు. ఏరియాలోని ఎల్లందు క్లబ్ లో శుక్రవారం నిర్వహించిన 23వ ఏరియా స్థాయి రక్షణ త్రైపాక్షిక సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఉద్యోగికి రక్షణ సూత్రాలపై అవగాహన కల్పించి, వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణతో పనిచేయించాలని సూచించారు.

ఉపరితల, భూగర్భ గనుల్లో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిష్ణాతులైన ఉద్యోగులను సునిశితమైన ప్రదేశాల్లో నియమించా లన్నారు. అనంతరం సింగరేణి డైరెక్టర్(పీ.పీ) కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సింగరేణిలో రక్షణ చర్యలపై యాజ మాన్యం పకడ్బందీ చర్యలు తీసుకుంటుందన్నారు. ఉద్యోగులు, అధికారులు కలిసికట్టుగా రక్షణ సూత్రాలు పాటిస్తూ బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్నామన్నారు. జిఎం సేఫ్టీ కార్పొరేట్ చింతల శ్రీనివాస్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా రక్షణపై ఉద్యోగులు, అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామన్నారు.

రక్షణ పై సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ను ప్రతి గనిలో పనిచేస్తున్న ఉద్యోగులకు వివరించినట్లు తెలిపారు. యూనియన్ల నాయకులు మాట్లాడుతూ గనుల్లో రక్షణ ఏర్పాట్లపై తీసుకుంటున్న చర్యలపై డీజీఎంఎస్ అధికారులకు వివరించారు. రక్షణ చర్యల్లో భాగంగా అధునాతన యంత్రాలు, నూతన సాంకేతిక తను వినియోగించుకోవాలని సూచించారు. కార్మిక సంఘాల నాయకుల సూచనలపై అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా అధికారులు, కార్మిక సంఘాల నాయకులు రక్షణ ప్రతిజ్ఞ చేశారు. గని ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగులు, అధికారుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.