calender_icon.png 26 July, 2025 | 1:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తా

25-07-2025 08:23:07 PM

మెడికోలకు ఎమ్మెల్యే హామీ 

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ మెడికల్ కళాశాల వసతి గృహాల్లో వసతులను కల్పించి, వారం రోజుల్లో మేడికోలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ తెలిపారు. నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల విద్యార్థుల హాస్టల్ భవన సముదాయాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారం రోజుల్లో హాస్టళ్లకు విద్యుత్ సరఫరా, మంచినీటి కనెక్షన్ ఇప్పించి విద్యార్థులకు ఇబ్బందులు తొలగిస్తామని హామీ ఇచ్చారు.