25-07-2025 08:36:22 PM
నాగల్ గిద్ద,(విజయక్రాంతి): నాగల్ గిద్ద మండలం ఔదాపూర్ గ్రామంలో మండల సూపర్వైజర్ ప్రశాంతి ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో బాలమేడ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిల్లల ఆటలు, పాటలు, నృత్యాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమం పిల్లల అభివృద్ధికి, వినోదానికి ఉపయోగపడుతుంది. సూపర్వైజర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ... అంగన్వాడీ బాలమేళ అనేది పిల్లల అభివృద్ధికి, వినోదానికి ఒక ముఖ్యమైన వేదిక. ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొనడం ద్వారా వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి సహాయపడుతుంది. ఇది పిల్లలకి సామాజిక నైపుణ్యాలను కూడా నేర్పుతుంది. బాలమేళలో ఆటలు పాటలు డ్రాయింగ్ కార్యకలాపాలు చేశారు. ఈ కార్యక్రమం పిల్లల మానసిక, శారీరక, సాంఘిక అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. బాలమేళ ద్వారా పిల్లలు కొత్త విషయాలు నేర్చుకోవడంతో పాటు, సంతోషంగా గడుపుతారు అని మండల సూపర్వైజర్ ప్రశాంతి తెలిపారు.