02-08-2025 05:40:52 PM
గత పది సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వని బీఆర్ఎస్..
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..
కామారెడ్డి (విజయక్రాంతి): అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ(Government Advisor Shabbir Ali) అన్నారు. శనివారం కామారెడ్డి హరిజనవాడలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలించిన పేదలకు ఒక్కరికి కూడా రేషన్ కార్డు పంపినీ చేయలేదన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుంటే టిఆర్ఎస్ నేతలకు మింగుడు పడక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. పేద ప్రజలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మ గోని లక్ష్మీ రాజా గౌడ్, తాసిల్దార్ జనార్ధన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పండ్ల రాజు, మాజీ సిడిసి చైర్మన్ కారంగుల అశోక్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడుగుల శ్రీనివాస్, పుట్నాల శ్రీనివాస్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.