02-08-2025 05:22:42 PM
సలాబత్పూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ రామ్ పటేల్..
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు(MLA Thota Laxmi kantha Rao) సహకారంతో అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు కృషి చేస్తున్నట్లు సలాబత్పూర్ ఆలయ కమిటీ చైర్మన్ రామ్ పటేల్ అన్నారు. ఇండ్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం విడతల వారీగా రూ.5 లక్షలు లబ్దిదారుల అకౌంట్లలో జమచేస్తుందని అన్నారు. నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి వారి కల సహకారం చేస్తుందనని సలాబత్పూర్ ఆలయ కమిటీ ఛైర్మన్ రామ్ పటేల్ అన్నారు. శనివారం మద్నూర్ మండలం పెద్ద శక్కర్గలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి లక్ష్మణ్, గ్రామస్థులు పాల్గొన్నారు.