calender_icon.png 2 August, 2025 | 7:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిమ్ ను యువత సద్వినియోగం చేసుకోవాలి

02-08-2025 05:37:52 PM

గేల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ మేనేజర్ బాలాజీ..

తుంగతుర్తి (విజయక్రాంతి): ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో గేల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్(GAIL India Private Limited) ఆధ్వర్యంలో పల్లెల్లో జిమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని గేల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ బాలాజీ తెలిపారు. శనివారం మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాలలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జిమ్ ను వ్యాయామ ఉపాధ్యాయుడు కొండగడుపుల యాకయ్యతో కలిసి సందర్శించి మాట్లాడారు.

ప్రజలు నిత్యం వ్యాయామంతో పాటు, యువకులు జిమ్ ను చేయాలన్నారు. మారుమూల ప్రాంతంలోని ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు గేల్ సంస్థ ఆధ్వర్యంలో ఓపెన్ జిమ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని గ్రామాల్లో జిమ్ లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం పాఠశాల విద్యార్థులు వారిని శాలువ తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కరుణాకర్, మధు తదితరులు పాల్గొన్నారు.