12-05-2025 06:25:52 PM
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఉత్తరవాహిని నది తీరంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయంలో సోమవారం భాజపా సీనియర్ నాయకుడు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరరావు హనుమాన్ మాలను స్వీకరించారు. ఆలయ అర్చకుడు శిరీష్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అరిగెలకు హనుమాన్ మాలధారణ వేశారు. ఈ నెల 22 జరిగే హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మాల వేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది దీపక్ కుమార్, ఆలయ కమిటీ అధ్యక్షులు గుండ వెంకన్న, నాయకులు శ్రీశైలం యాదవ్ తదితరులు ఉన్నారు.