12-05-2025 11:28:15 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీని పటిష్టపరిచేందుకు కార్యచరణ చేపట్టాలని, పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి పని చేస్తున్న నాయకులను పదవులకు ఎంపిక చేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కోసం సన్నద్ధత సభ నిర్వహించారు. డిసిసి అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, మహబూబాబాద్ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతున్న నాయకులను సంస్థ గత నిర్మాణంలో కీలక పాత్ర వహించేలా కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా పెద్దపీట వేయాలని కోరారు.