calender_icon.png 12 May, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు అమూల్యం

12-05-2025 06:20:36 PM

మహాదేవపూర్,(విజయక్రాంతి): ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలు అమూల్యమైనవని, నర్సింగ్ సిస్టర్లు ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ విద్యావతి అన్నారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రముఖ సంఘ సేవకురాలు, నర్సింగ్ సేవలకు ఆధ్యురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదిన  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

క్యాండిల్ లైట్ లతో మననం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ వినయ్ కుమారీ మాట్లాడుతూ... యుద్ధ సమయంలో సైతం ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రాణానికి లెక్క చేయకుండా రోగులకు సేవలు అందించి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి పండ్లు, సీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బాలమణి, నర్సింగ్ ఆఫీసర్లు, ఐసిటిసి కౌన్సిలర్ గాదె రమేష్, శానిటేషన్ సూపర్వైజర్ కడార్ల రాజబాబు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.