12-05-2025 11:17:25 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతిరెడ్డి కోటిరెడ్డి, ఇందిరా దంపతుల కుమారుడు జగన్మోహన్ రెడ్డి, కుమార్తె షర్మిల రెడ్డిల పంచ కట్టు,ఓణి అలంకరణ వేడుకలో భాగంగా సోమవారం వారి నివాసానికి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వెళ్లి చిన్నారులను ఆశీర్వదించారు. అనంతరం నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు గాంధీ, బాదం రమేష్ రెడ్డి,గాదే వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.