calender_icon.png 13 May, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ మట్టి తరలింపు దారులపై చర్యలు చేపట్టాలి

12-05-2025 11:24:13 PM

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని అందుగులపేట సమీపం లోని జాతీయ రహదారిని అనుకోని సాగుతున్న అక్రమ మట్టి దందాపై అదికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు అసంపల్లి శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఇటీవల విజయక్రాంతి పత్రికలో వచ్చిన "పట్టపగలే మట్టి దందా" శీర్షికన వచ్చిన కథనాన్ని జత పరిచి ఆయన తహసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల నుండి చంద్రపూర్ వెళ్లే జాతీయ రహదారిని ఆనుకొని అందుగులపేట సమీపాన పెద్ద మొత్తంలో మట్టి మొరం దందా కొనసాగుతుందనీ అయినప్పటికీ సంబధిత అధికారులకు కనిపించక పోవడం అధికారుల పనితీరుకు నిదర్శనం అన్నారు. జాతీయ రహదారి వెంట పెద్ద మొత్తంలో టిప్పర్ల ద్వారా మట్టి రవాణా చేస్తు వందల టిప్పర్ల ద్వార మొరం వే బిల్లులు లేకుండా తరలించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడు తున్నప్పటికి అదికారులు ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారనీ ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి రాయాల్టీలు కట్టకుండా, అనుమతులు తీసుకోకుండా దందా కొనసాగిస్తున్నారనీ అదికారుల సంపూర్ణ సహకారంతోనే మట్టి దండా యదేచ్చగా సాగుతుంద ని ఆయన ఆరోపించారు.

ప్రతినిత్యం  జిల్లాలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు ప్రయాణించే జాతీయ రహదారిని అనుకుని పెద్ద మొత్తంలో మొరం మట్టి దందా సాగుతున్నప్పటికీ అదికారులు దృష్టి సాధించకపోవడం అనుమానాలు కలిగిస్తుందని ఆన్నారు.మట్టి దందా పై విజయ క్రాంతి పత్రికలో కథనం వచ్చి 4 రోజులు గడిచినప్పటికీ అధికారులు స్పందించక పోవడం అధికారుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శన మన్నారు. వెంటనే అదికారులు స్పందించి మట్టి తరలింపుపై తక్షణమే విచారణ జరిపి అక్రమ మట్టి దందాను నిలిపివేసి అక్రమ దందా బాద్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతానని ఆయన స్పష్టం చేశారు. కాగా వినతి పత్రం ఇచ్చిన వారిలో ఎమ్మార్పీఎస్ నాయకులు బచ్చలి కిషోర్, అసంపల్లి సతీష్ లు పాల్గొన్నారు.

కథనం వచ్చిన పట్టించుకోని అదికారులు

పట్టపగలే మట్టిదందా కథనంపై  విజయక్రాంతిలో కథనం వచ్చినప్పటికీ రెవెన్యూ,మైనింగ్ అదికారులు చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది.సాక్షాత్తు జాతీయ రహదారిని ఆనుకుని పట్టపగలే మట్టి దండ సాగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు జాతీయ రహదారి గుండా పర్యటిస్తున్న ప్పటికీ వారికి కనపడక పోవడం విడ్డూరంగా ఉందని పట్టణ ప్రజలు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మట్టి దండాపై కఠిన చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.