calender_icon.png 28 August, 2025 | 4:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడలో భారీ వర్షం

28-08-2025 12:57:17 PM

  1. బాన్సువాడ డివిజన్ లో వరద దాటికి నిలిచిపోయిన రాకపోకలు.
  2. పలు మండలాల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జిలు రహదారులు.
  3. భారీ వర్షానికి నీట మునిగిన పంట పొలాలు.
  4. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాలు.

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ డివిజన్ వ్యాప్తంగా గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  బాన్సువాడ డివిజన్ లోని కోటగిరి,రుద్రుర్, వర్ని,బాన్సువాడ ,నస్రుల్లాబాద్, చందూర్,బీర్కూర్ మండల తో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మద్నూర్ జుక్కల్ పిట్లం పెద్దకొడప్గల్ నిజాంసాగర్ మహమ్మద్ నగర్ మండలంలో భారీ వర్షం కురిసింది.  నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ స్థాయిలో వరద చేరుకోవడంతో డ్యాం కు గల 24 గేట్లను ఎత్తివేసి మంజీరా నదిలోకి వదలడంతో మంజీరా నది ఉగ్రరూపాన్ని దాల్చింది పోతంగల్ మండలం సుంకిని గ్రామంలో సుమారు 100 ఎకరాలు నీట మునిగిన పంట పొలాలు బాన్సువాడ లో పంట పొలంలోకి భారీగా వరద నీరు , మోస్రా మండల కేంద్రంలోని అంగడి బజార్ కాలనీలోకి వర్షపునీరు ,చందూర్ గ్రామంలో భారీ వర్షం ఉద్రికతంగా ప్రవహిస్తున్న  వాగు హనుమాన్ మందిరం. గొల్లగల్లి కాలనీలోకి చేరిన వరద నీరు. లక్ష్మీ సాగర్ చెరువు మేడి పల్లి తాండ వద్ద పొంగిపొడుతున్న వాగులు వంకలు బాన్సువాడ మండలం కోనాపూర్  చెరువు అలుగు పారుతు ఉంది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నిజాంసాగర్ మహమ్మద్ నగర్  ఎల్లారెడ్డి రహదారి మధ్యలో బొబ్బిశ చౌరస్తాలో భారీ వర్ధకు రోడ్లు కొట్టుకపోయి రాకపోకలు నిలిచాయి. కళ్యాణి ప్రాజెక్ట్ పై నుండి భారీగా వరద నీరు ప్రవహించడంతో కళ్యాణి ప్రాజెక్ట్ డేంజర్ లో ఉంది. బీర్కూర్ బిచ్కుంద వెళ్లే బ్రిడ్జి నుండి ప్రమాద స్థాయిలో వర్ధనీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి పిట్లం కుర్తి బ్రిడ్జి పైనుండి మంజీరా పొంగిపొల్లడంతో రాకపోగల నిలిచాయి. హనుమాజీపేట్ సంఘోజిపేట్ కోనాపూర్ బడాపహాడ్ రహదారులపై నుండి భారీ వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి మొండి సడక్ గాంధారి వెళ్లే రహదారి మధ్యలో చెట్లు పడిపోవడంతో రాకపోకలు నిలిచాయి నరసలాబాద్ వర్ని వెళ్లే ప్రధాన రహదారిపై దర్గా వద్ద భారీ వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచాయి.భారీ వర్షాల కారణంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని మంజీరా పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులు కూడా విధుల్లో ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ప్రజలకు అందుబాటులో ఉండాలని ఇలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి తెలిపారు.