28-08-2025 01:00:11 PM
మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు...
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పురపాలక సంఘ కార్యాలయంలో ఎమర్జెన్సీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు. గురువారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పట్టణంలోని కాలనీలో ఇబ్బందులు ఏర్పడిన, ఏమైనా సహాయక చర్యల కోసం కంట్రోల్ రూమ్ నెం. 7386188455 - సతీష్ 7386093132 - హన్మాండ్లు లకు సంప్రదించగలరనీ ఆయన తెలిపారు. ఎక్కడైనా పాత ఇండ్లు కూలిపోయే పరిస్థితిలో ఉన్నట్లయితే వారికోసం పునరావాస కేంద్రంగా పాత పురపాలక సంఘ కార్యాలయం భవనమును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు.పట్టణ ప్రజలు దయచేసి ఇండ్లు వదిలి బయటికి రాకూడదని కరెంటు స్తంభాలు, వాగులు చెరువుల వద్ద ఉండరాదని కమిషనర్ శ్రీహరి రాజు సూచించారు.