calender_icon.png 28 August, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రౌడీ షీటర్ అరెస్ట్

28-08-2025 12:54:41 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని(Bellampalli town) గాంధీ చౌరస్తా వద్దగల దత్తాత్రేయ మెడికల్  షాప్ ఎదుట ఒక వ్యక్తిపై హత్య ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలో కాంట్రాక్టర్ బస్తీకి చెందిన రౌడీ షీటర్ గొర్ల అఖిల్ ను అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు బెల్లంపల్లి వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు తెలిపారు. మెడికల్ షాపులో పనిచేస్తున్న చొక్కాల సతీష్ అనే యువకుడిని బండ రాయితో తలపై కొట్టి తీవ్రంగా గాయపరచాడని తెలిపారు. బాధితుడు సతీష్ అతని స్నేహితుడు తిరుపతికి రూ 2 లక్షలు ఇచ్చి అడిగే ప్రయత్నంలో అఖిల్ జోక్యం చేసుకొని కొట్టినట్లు తెలిపారు. అఖిల్ పై బెల్లంపల్లి వన్ టౌన్ , టూ టౌన్ పోలీస్ స్టేషన్ లలో ఇప్పటికే 6 కేసులు నమోదయి ఉన్నట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, వారిపై అవసరమైతే పి డీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు.