calender_icon.png 27 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు

27-11-2025 07:39:53 PM

ఆర్మూర్ (విజయక్రాంతి): ఏసీబీ అధికారులకు మరో లంచగొండి చేప చిక్కింది. పనిలో తాను సత్య హరిచంద్రుని, పలుమార్లు ఉత్తమ కమిషనర్ గా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న కమిషనర్ రాజు చివరికి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఇంటి నంబర్ కు సంబంధించిన విషయంలో తాను డిమాండ్ చేసిన డబ్బులలో గురువారం 50 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా వలపనిల ఏసీబీ అధికారులు కమిషనర్ రాజును వలలో పట్టుకున్నారు. కమిషనర్ నివాసము వద్ద కమిషనర్ రాజు డ్రైవర్ కు సదరు వ్యక్తులు డబ్బులను ఇవ్వగా అప్పటికే వలపన్న ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ అధికారులు రాజు డ్రైవర్ వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా 4,30,000 రూపాయల ఎలాంటి ఆధారం లేని నగదును కూడా స్వాధీన పరచుకొని, ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు తదుపరి విచారణ చేపట్టమున్నట్లు తెలిపారు.