calender_icon.png 27 November, 2025 | 9:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారు బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు

27-11-2025 07:37:18 PM

బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామానికి చెందిన సూర్య ద్విచక్రవాహనంపై బోధన్ వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా అతివేగంగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో సూర్య కాలి వద్ద తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.