calender_icon.png 11 November, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పకడ్బందీగా సెట్స్

11-11-2025 02:11:21 AM

పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు

హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో నిర్వ హించే కామన్ ఎంట్రెన్స్ టెస్టు(సెట్స్)లను పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. సోమవారం ఇందుకు సంబంధించి సెట్స్ సమావేశాన్ని అధికారులు నిర్వహించారు. ఈ ఏడాది పరీక్షల సమయంలో కరెంట్ పోవడం, కంప్యూటర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం లాంటి చిన్నచిన్న పొరపాట్లు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి పొరపాట్లు ఈసారి జరగకుండా పకడ్బందీగా వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.