11-11-2025 02:10:50 AM
-తిర్యాణిలో 10.9 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
-చల్లని ఈదురు గాలులు, పొగమంచుతో ప్రజలకు ఇబ్బందులు
కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లాలో చలి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతోంది. చలి ప్రారంభమైన మూడు రోజుల్లోనే 10 డిగ్రీల కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు ఆం దోళన చెందుతున్నారు. రాత్రి, తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనజీవ నం ప్రభావితమవుతోంది.
లింగపూర్ మండలంలో సోమవా రం కనిష్ఠంగా 10.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. జిల్లా వ్యా ప్తంగా ఉదయం గాలులతో పాటు పొగమం చు కమ్మేసింది. ఆసిఫాబాద్ కేంద్రంతో పాటు ఏజెన్సీ పరిసర ప్రాంతాలు ఊటీని తలపించాయి. ఉదయం ఎనిమిది గంటలయినా సూర్యోదయం కనిపించకపోవడంతో వాహనదారులు లైట్లు ఆన్ చేసుకొని ప్రయాణం చేయాల్సి వస్తుంది. వృద్ధులు, చిన్నారులు చ లి కారణంగా ఇళ్లలోనే ఉండిపోతున్నారు.
కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్, నవంబర్ 10 (విజయక్రాంతి): రానున్న రెండు మూడు రోజుల్లో తెలంగాణలోని కొన్ని ప్రాం తాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణం కంటే 3 నుంచి 4 సెంటీగ్రేడ్ వరకు తక్కువగా ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపింది.