calender_icon.png 18 September, 2025 | 8:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఆర్మీ జవాన్ ప్లేట్లు బ్యాగుల వితరణ

18-09-2025 06:30:10 PM

ధర్మపురి (విజయక్రాంతి): వెల్గటూర్ కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు ఆర్మీ జవాన్ జక్కుల సుభాష్ యాదవ్ తన స్వగ్రామంపై మమకారంతో  తన తల్లి జక్కుల మల్లవ్వ ఙ్ఞాపకం మధ్యాహ్న భోజనానికి ప్లేట్లు బ్యాగులు అందించి తన వితరణ చాటుకున్నారు. గత కొన్నేళ్ల క్రితం మూతపడిన కుమ్మరిపల్లి ప్రాథమిక పాఠశాల ఈ విద్యా సంవత్సరం పునః ప్రారంభమైంది. దీంతో పలువురు విద్యార్థులు స్థానికంగా విద్యాభ్యాసానికి అవకాశం లభించింది. ఈ విద్యార్థులకు తన వంతు చేయూతను అందించాలని స్వగ్రామంపై మమకారంతో సుభాష్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. పాఠశాలలో చదువుతున్న 15 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి ప్లేట్లతో పాటు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్కులు, పెన్నులు, పెన్సిల్లు, స్కేళ్ళు, రబ్బర్ చాక్ మార్ తదితర సామాగ్రిని అందించారు.

వీటిని మండల విద్యాధికారి బోనగిరి ప్రభాకర్, పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు చిప్పనందయ్య గురువారం విద్యార్థులకు కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుభాష్ అతని కుటుంబ సభ్యుల సేవాభావాన్ని కొనియాడారు. దాతలు చేయూతనందిస్తే ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మరింత మెరుగైన నాణ్యమైన విద్య లభిస్తుందని మండల విద్యాధికారి పేర్కొన్నారు. కార్యక్రమంలో సుభాష్ తండ్రి మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ ముచ్చర్ల తిరుపతి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ గంగ రాజవ్వ, ప్రధానోపాధ్యాయులు లచ్చయ్య, క్లస్టర్ రిసోర్స్ పర్సన్ వైద్య వెంకటేష్, స్థానికులు జక్కుల అంజయ్య, అల్లె సుభాష్, జక్కుల రాజు, కొప్పుల వెంకటేష్, మంగ, తదితరులు పాల్గొన్నారు